ఆ ఇంటికి ఎప్పుడు వెళుతున్నావ్?
ABN , First Publish Date - 2020-09-09T05:30:00+05:30 IST
‘బిగ్ బాస్’కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు నాలుగో సీజన్ వచ్చేసింది కూడా! లఘుచిత్రాల్లో నటించే అలేఖ్య హారిక ఈ సీజన్‌కు ఎంపికైంది.
‘బిగ్ బాస్’కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు నాలుగో సీజన్ వచ్చేసింది కూడా! లఘుచిత్రాల్లో నటించే అలేఖ్య హారిక ఈ సీజన్‌కు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె చుట్టూ అల్లిన ఓ సరదా వీడియోనే ‘ఏంటి... బిగ్ బాసా’! నిజానికి ఇది కూడా ఒక షార్ట్ ఫిలిమ్‌లా ఉంటుంది. కాన్సెప్ట్ ఏమిటంటే... సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి హారిక. ఓ రోజు ఆమె తన ఇంటి నుంచి బయటకు రాగానే కనిపించిన ప్రతి ఒక్కరూ ‘హారిక... ఆ ఇంటికి ఎప్పుడు వెళుతున్నావ్’ అంటూ అడుగుతుంటారు. ‘ఆ ఇల్లేమిటి? నాకున్నది ఇదొక్కటే ఇల్లు’ అని ఎంత చెప్పినా ఎవరూ వినరు. చివరకు ఆఫీసులో కొలీగ్ కూడా అదే ప్రశ్న వేస్తాడు. ‘అందరూ ‘ఆ ఇల్లు’ అంటున్నారు. ఏ ఇల్లురా’ అని అసహనంగా, చిరాగ్గా అడుగుతుంది హారిక. ‘అదే... నువ్వు ‘బిగ్ బాస్’ హౌస్‌కు వెళుతున్నావుట కదా! మీ అన్నయ్య వాట్సప్ చేశాడు’ అంటాడు కొలీగ్. ఇంటికి వెళ్లిన హారిక కోపంతో అన్నయ్యను నిలదీస్తుంది. ‘ఏదో సరదాగా టైమ్ పాస్ కోసం చేశా’ అంటాడు అన్నయ్య. కట్ చేస్తే హారిక ‘బిగ్ బాస్’కు ఎంపికవుతుంది. చివరకు అన్నయ్య చెప్పే వరకు ఆ విషయం తెలియదు హారికకు! చివరల్లో హారిక ధన్యవాదాలు చెప్పే క్లిప్పింగ్‌తో వీడియో ముగుస్తుంది. రెండు రోజుల కిందట యూట్యూబ్‌లో విడుదలైన ఈ వీడియోను ఇప్పటికి 8.8 లక్షల మంది వీక్షించారంటే, హారిక ఫాలోయింగ్ ఏంటో వేరే చెప్పక్క ర్లేదేమో!
ఏంటి... బిగ్ బాసా!
కాన్సెప్ట్, రచన: పవన్‌కుమార్ దంతూరి
విడుదల: సెప్టెంబర్ 6
వ్యూస్: 8.8 లక్షలు