మైదాన్ దసరాకు మారింది
ABN , First Publish Date - 2020-12-13T06:59:16+05:30 IST
శుక్రవారం కొత్త చిత్రం ‘మేడే’ షూటింగ్‌ను ప్రారంభించిన అజయ్ దేవ్‌గణ్ శనివారం తన ‘మైదాన్’ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్టు తెలిపారు...

శుక్రవారం కొత్త చిత్రం ‘మేడే’ షూటింగ్‌ను ప్రారంభించిన అజయ్ దేవ్‌గణ్ శనివారం తన ‘మైదాన్’ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో ఒకప్పటి ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ నటిస్తున్నారు. తొలుత ఆగస్టులో విడుదల చేస్తున్నట్టు, తర్వాత ఈ ఏడాది డిసెంబర్ 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
కానీ కరోనా-లాక్డౌన్ వల్ల చిత్రీకరణలు నిలిచిపోవడంతో అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల సాధ్యం కాలేదు. ప్రస్తుతం ‘మేడే’ షూటింగ్లో అజయ్ పాల్గొంటున్నారు. జనవరిలో ‘మైదాన్’ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.