ఉల్లాసిని
ABN , First Publish Date - 2020-07-08T05:30:00+05:30 IST
ఐశ్వర్యా మీనన్... ఈ పేరు తెలుగువారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో బాగా పాపులర్. అమ్మానాన్నలది కేరళ అయినా... ఈ క్యూటీ పెరిగిందంతా తమిళ నాడులోని ఈరోడ్‌లో...

ఐశ్వర్యా మీనన్... ఈ పేరు తెలుగువారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో బాగా పాపులర్. అమ్మానాన్నలది కేరళ అయినా... ఈ క్యూటీ పెరిగిందంతా తమిళ నాడులోని ఈరోడ్‌లో. చేసిన సినిమాలు తక్కువే. అయితేనేం ‘గ్లామర్ గర్ల్’గా కుర్రోళ్ల హృదయాలకు దగ్గరయింది. అందంగా కనిపించడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే ఐశ్వర్య... ప్లాస్టిక్ సర్జరీతో దానికి మరిన్ని వన్నెలద్దుకుంది. ఎక్కడ ఉన్నా... ఏంచేస్తున్నా... ఆమె విభిన్నమైన లుక్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. వేసే డ్రెస్... పెట్టే పోజు... ఏం చేసినా గ్లామరస్‌గానే! ప్రత్యేకంగా ఈ కరోనా కాలంలో ఇంటి నుంచి బయటకు కదలకపోయినా... రకరకాల స్టిల్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పెట్టి... ఉల్లాసాన్ని నింపుతోంది. అలాంటిదే ఈ ఫొటో!