మరోసారి సిల్క్ బయోపిక్
ABN , First Publish Date - 2020-10-04T05:30:00+05:30 IST
దివంగత సినీనటి సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా గతంలో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంతో విద్యాబాలన్ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు పొందారు...
దివంగత సినీనటి సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా గతంలో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంతో విద్యాబాలన్ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు పొందారు. ఇప్పుడు సిల్క్‌స్మిత జీవితంపై తమిళంలో మరో బయోపిక్ రాబోతోంది. ప్రముఖ తమిళ హాస్యనటుడు సంతానం నటించిన హిట్ మూవీ ‘కన్నా లడ్డూ తిన్నా ఆశయ్యా’ చిత్ర దర్శకుడు కెఎస్ మణికందన్ ‘అవల్ అప్పాడితాన్’ పేరుతో ఈ బయోపిక్ తీస్తున్నారు. గాయత్రీ ఫిల్మ్స్ పతాకంపై చిత్రా లక్ష్మణన్, హెచ్ మురళీ నిర్మిస్తున్నారు. నవంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ‘‘సిల్క్‌స్మిత జీవితంలో బయటకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఈ చిత్రంలో చూపిస్తాం. నటీనటులు వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని దర్శకుడు చెప్పారు.