పొడుగు కాళ్ల టీనేజర్‌

ABN , First Publish Date - 2020-10-12T05:37:57+05:30 IST

పుట్టుకతోనే ఎత్తుగా పుట్టింది మాసీ కర్రీన్‌. పదిహేడేళ్లకే 6.10 అడుగుల పొడవు పెరిగింది. దాంతో దుస్తులు దొరకడం కష్టమై పోయింది. ఎత్తుతో ఆమె పడిన ఇబ్బందులు చాలానే. అయితే ఒకింత సంతోషకరమైన వార్త ఏమిటంటే ఇప్పుడు ఆమె ప్రపంచంలోనే పొడవైన కాళ్లున్న టీనేజర్‌గా గుర్తింపు సాధించింది.

పొడుగు కాళ్ల టీనేజర్‌

పుట్టుకతోనే ఎత్తుగా పుట్టింది మాసీ కర్రీన్‌. పదిహేడేళ్లకే 6.10 అడుగుల పొడవు పెరిగింది. దాంతో దుస్తులు దొరకడం కష్టమై పోయింది. ఎత్తుతో ఆమె పడిన ఇబ్బందులు చాలానే. అయితే ఒకింత సంతోషకరమైన వార్త ఏమిటంటే ఇప్పుడు ఆమె ప్రపంచంలోనే పొడవైన కాళ్లున్న టీనేజర్‌గా గుర్తింపు సాధించింది. కర్రీన్‌ ఎత్తులో దాదాపు సంగానికి పైగా ఎత్తు ఆమె కాళ్లదే కావడం విశేషం. తన పొడవైన కాళ్లతో రెండు గిన్నిస్‌ బుక్‌ రికార్డులు సొంతం చేసుకున్న ఈ యువతి కల పొడవైన మోడల్‌గా పేరు తెచ్చుకోవడం.


అమెరికాలోని టెక్సా్‌సలో ఉంటున్న కర్రీన్‌ వాళ్ల ఇంట్లో అందరికన్నా పొడగరి. వాళ్ల అమ్మ త్రిష్‌ మాత్రమే 5.7 అడుగుల పొడవు ఉంటుంది ఆమె నాన్న, సోదరుడి ఎత్తు ఆరడుగుల పైనే, వాళ్ల నాన్న కామెరూన్‌ ఆరడుగుల అయిదు ఇంచులు, సోదరుడు జాకబ్‌ ఆరడుగుల మూడు ఇంచుల పొడవు ఉన్నారు. పుట్టినప్పుడు అందరు పిల్లల కన్నా కర్రీన్‌ ఎత్తుగా (ఒకటిన్నర అడుగు) ఉండడం ఆమె తల్లి గమనించింది. కర్రీన్‌ వయసుకు మించి ఎత్తు పెరగడం చూసి అందరూ ఆశ్చర్యపోయేయారు. 18 నెలలకే కర్రీన్‌ 2 అడుగుల ఎత్తు పెరిగింది. తొమ్మిదేళ్లు వచ్చేసరికి ఆమె ఎత్తు అయిదు అడుగుల ఏడు అంగుళాలు. ఆమె కాళ్లు నాలుగు ఫీట్ల పొడవున్నాయి. ఆమె పొడవులో అరవై శాతం కాళ్ల పొడవే కావడం విశేషం. తన స్నేహితులతో కలిసి స్కూలుకు వెళుతున్న కర్రీన్‌ను చూసి, చాలామంది ఫొటోలు తీసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ‘నా అనుమతి లేకుండా నా ఫొటోలు తీయడం నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది’ అంటుందీ టీనేజర్‌. హైస్కూల్‌ వయసు నుంచే తన ఎత్తు గురించి ఎమరేమి అనుకున్నా పట్టించుకోవడం మానేసింది కర్రీన్‌. ఆ రోజు నుంచి తనకు నచ్చినట్టుగా ఉండడం అలవాటు చేసుకుంది.రెండు రికార్డులు

తన పొడవైన కాళ్లను చూసి ఆనందపడాలో, బాధ పడాలో తెలియడం లేదు అంటుంది కర్రీన్‌. ‘నా కాళ్లు ఎక్కువ పొడవు ఉండడం ఒక పక్క గర్వంగానూ, మరోపక్క ఇబ్బందికరంగానూ అనిపిస్తుంటుంది. ఇంత పొడవు కాళ్లు ఉండడం వల్ల ఇంట్లో గుమ్మం దాటేటప్పుడు తల తగులుతుంది. అలానే కారులో కూర్చోవడం, సరిపోయే దుస్తులు వెతుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకరోజు నేను లెగ్గిన్స్‌ కొందామని స్టోర్‌కి వెళ్లాను. కానీ నా పొడవు కాళ్లకు సరిపడే లెగ్గిన్స్‌ అక్కడ లేవు. దాంతో ప్రత్యేకంగా కుట్టించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు నేను జీన్స్‌ కూడా ధరించను. కొలరాడాలోని ఒక స్టోర్‌లో ఎక్స్‌ట్రా లాంగ్‌ యోగా ప్యాంట్స్‌ అమ్ముతారు. అక్కడికి వెళ్ల్లి కొనుక్కుంటాను’’ అంటున్న కర్రీన్‌ గతంలో టిక్‌టాక్‌లో పలు వీడియోలు చేసింది. ప్రపంచలోనే పొడవైన కాళ్లున్న అమ్మాయిగా, పొడవు కాళ్ల టీనేజర్‌గా రెండు గిన్నిస్‌ రికార్డులు కర్రీన్‌ పేరు మీద అధికారికంగా నమోదు కావాల్సి ఉంది.


Updated Date - 2020-10-12T05:37:57+05:30 IST