-
-
Home » Miscellaneous » Vrushabam horoscope yearly 28/12/2020
-
Vrushabam horoscope yearly 28/12/2020
ABN , First Publish Date - 2020-12-28T23:15:57+05:30 IST
Vrushabam horoscope yearly 28/12/2020

కృత్తిక 2,3,4; రోహిణి; మృగశిర 1,2 పాదాలు ఆదాయం - 2 వ్యయం - 8 రాజపూజ్యం - 7 అవమానం - 3 వృషభ రాశి వారు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు తదుపరి నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. న్యాయపోరాటాల్లో విజయం సాధి స్తారు. ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. గురువు వక్రగమనంలో ఉండే జూన్ - అక్టోబర్ మాసాల మధ్య ఆందోళనలు అధికం. వృత్తిలో ఒత్తిడులకు లోనవుతారు. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. గురుగ్రహం ఈ ఏడాది మీ జన్మ రాశి నుంచి 9-10 స్థానాల్లో సంచరించడం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రక్షణ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్, ఉన్నత విద్య, విదేశీ రంగాల వారికి ప్రోత్సాహకరం. సంతానప్రాప్తికి అనుకూలం. వృత్తి, వ్యాపా రాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. జూన్ 21 - అక్టోబర్ 12 మధ్య గురువు వక్రించిన కారణంగా మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం. మోసపోయే అవకాశం ఉంది. బదిలీల్లో అసౌకర్యం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది శని 9వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. జీతభత్యాలు పెరుగుతాయి. లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పేరు సంపాదిస్తారు. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడుతుంది. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. సంతానం కోరుకునే వారి సంకల్పం ఫలిస్తుంది. మే 24 - అక్టోబర్ 18 తేదీల మధ్య శని వక్రగమనంలో ఉన్నందున పైఅధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల పట్ల శ్రద్ధ చూపాలి. 1 - 7 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా దంపతుల మధ్య అవగాహన లోపిస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైఫల్యాల కారణంగా మనసు నిరు త్సాహకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. స్నేహానుబంధాలను జాగ్రత్తగా కాపాడు కోవాలి. విద్యార్థులు చదువులపై మరింత శ్రద్ధ చూపాలి. ఓరిమితో వ్యవహరిస్తే విజయం సాధించగలుగుతారు. శ్రీ దుర్గాదేవీ ఆరాధన సకల శుభాలను కలుగజేస్తుంది.