బీజేపీలోకి విక్రమ్ గౌడ్?

ABN , First Publish Date - 2020-11-21T16:35:58+05:30 IST

విక్రమ్ గౌడ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలోకి వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.

బీజేపీలోకి విక్రమ్ గౌడ్?

హైదరాబాద్: దివంగత మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు  విక్రమ్ గౌడ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలోకి వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. విక్రమ్ గౌడ్‌తో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలియవచ్చింది. గోషామహాల్ డివిజన్ కాంగ్రెస్ టికెట్‌పై కాంగ్రెస్ నాయకత్వంతో విక్రమ్ గౌడ్‌కు విబేధాలు వచ్చాయి. దీంతో గోషామహల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గోషామహల్ డివిజన్ టిక్కెట్ తన వర్గీయులకు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసే యోచనలో విక్రమ్ గౌడ్ ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలో మిగిలిన 5 డివిజన్‌లో నామినేషన్ వేసిన అభ్యర్ధులు కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

Read more