-
-
Home » Miscellaneous » Uttam Kumar Reddy comments
-
టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: ఉత్తమ్
ABN , First Publish Date - 2020-11-25T19:45:25+05:30 IST
టీఆర్ఎస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేంద్రం పెట్టిన బిల్లులకు టీఆర్ఎస్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సీఎం కేసీఆర్ మద్దతు పలికారని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజకీయ అవగాహన లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్‌లో చిల్లర కార్పొరేటర్‌గా గెలిచిన బండి సంజయ్.. ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌కి హైదరాబాద్ ఎక్కడుందో సరిగా తెలియదని, అలాంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేస్తే ఇలాగే ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.