-
-
Home » Miscellaneous » trs vijayashanthi surgical strike
-
సర్జికల్ స్ట్రైక్ పేరెత్తగానే టీఆర్ఎస్, ఎంఐఎం ఆగమాగమవుతున్నాయి: విజయశాంతి
ABN , First Publish Date - 2020-11-25T17:34:08+05:30 IST
టీఆర్ఎస్ సర్కార్‌పై వరుస ట్వీట్లతో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ

ఇంటర్నెట్ డెస్క్: టీఆర్ఎస్ సర్కార్‌పై వరుస ట్వీట్లతో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆమె తాజాగా ట్వీట్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి సర్జికల్ స్ట్రయిక్ అంటే.. టీఆర్ఎస్, ఎంఐఎం ఆగమాగం ఎందుకు అవుతున్నాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే చేసిందిగా... పాతబస్తీలో ఆ విధంగా ఎవరూ లేరని... తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వచ్చు కదా అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే టీఆర్ఎస్ భయాందోళనలకు గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముందని ట్వీట్ చేశారు.