-
-
Home » Miscellaneous » trs potlapalli balakrishna
-
టీఆర్‌ఎస్ రెబల్‌గా బాలకృష్ణ నామినేషన్
ABN , First Publish Date - 2020-11-21T18:41:45+05:30 IST
ఆల్విన్‌కాలనీ డివిజన్ టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా అఖిలభారత కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు పోట్లపల్లి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు.

హైదర్‌నగర్: ఆల్విన్‌కాలనీ డివిజన్ టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా అఖిలభారత కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు పోట్లపల్లి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోకముందు నుంచి కేసీఆర్ అభిమాన సంఘం పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఏనాడూ పార్టీ నుంచి ఏమీ ఆశించలేదని, డివిజన్ అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయం సరైనది కాదని భావించడం వల్లనే తాను నామినేషన్ వేసినట్లు ఆయన తెలిపారు.