-
-
Home » Miscellaneous » trs ghmc elections
-
వెన్నంటే ఉండి వెన్నుపోట్లు
ABN , First Publish Date - 2020-12-06T15:18:20+05:30 IST
ఓడిన అభ్యర్థులు కారణాలను విశ్లేషించుకుంటున్నారు.

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు కారణాలను విశ్లేషించుకుంటున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారం, డివిజన్ ఇన్‌చార్జిగా వచ్చిన మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు, వారి అనుచరుల సహకారం, డివిజన్ పరిధిలో ఉన్న శ్రేణుల సహకారంపై లెక్కలు వేస్తున్నారు. వెన్ను పోటుదారులను గుర్తించే పనిలో పడ్డారు. గెలిచిన అభ్యర్థుల కుల గోత్రాలు ఎమ్మెల్యేకు సరిపోయే విధంగా ఉంటే కుట్ర చేసి ఓడించారనే ఆరోపణలు చేస్తున్నారు. ఎల్‌బీ నగర్‌లో ఓ టీఆర్‌ఎస్ అభ్యర్థి భర్త తనతో పక్కనున్న వాళ్లు బాగా డబ్బులు ఖర్చు పెట్టించారని బాధ పడిపోయారు. ఆ డబ్బులు ఓటర్లకు చేరకపోవడం వల్లే ఓడిపోయామని అనుమానం వ్యక్తం చేశారు.
మల్కాజిగిరిలో ఓ అభ్యర్థి పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేయగా.. ఓటర్లకు చేరలేదని చెబుతున్నట్లు తెలిసింది. కులాలు, మహిళా, యువజన సంఘాలకు అభ్యర్థులు పెద్ద మొత్తంలో నగదు సమర్పించారు. అపార్ట్‌మెంట్లు, కాలనీ అసోసియేషన్లు కోరిన కోర్కెలను తీర్చారు. దైవసాక్షిగా ప్రమాణాలు చేసిన వారు సైతం తమను నిలువునా ముంచారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌బీనగర్, సనత్‌నగర్, కంటోన్మెంట్ నియోజ కవర్గాల పరిధిలో అభ్యర్థుల అనుచరులు ఓటర్లతో వాదనలకు దిగినట్లు సమాచారం.