ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఈ ఫలితాలే నిదర్శనం: కోదండరాం

ABN , First Publish Date - 2020-12-06T08:12:50+05:30 IST

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.

ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఈ ఫలితాలే నిదర్శనం: కోదండరాం

భువనగిరి టౌన్‌, డిసెంబరు 5: ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆయన భువనగిరిలో శనివారం విస్తృతంగా పర్యటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలే రాబోయే రెండు నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో పునరావృతమవుతాయన్నారు.

మిషన్‌ భగీరథ, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని విమర్శించారు.  రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయ మార్పులు జరగాలని, అభివృద్ధి ఎజెండాను విద్యావంతులు నిర్ణయించాలని పేర్కొన్నారు.


Read more