టీఆర్ఎస్‌కు స్వామిగౌడ్ సూటి ప్రశ్న..

ABN , First Publish Date - 2020-11-27T20:03:45+05:30 IST

వెయ్యి రూపాయాలు ఇచ్చి.. తర్వాత తంతానంటే ఊరుకుంటామా?..

టీఆర్ఎస్‌కు స్వామిగౌడ్ సూటి ప్రశ్న..

హైదరాబాద్: వెయ్యి రూపాయాలు ఇచ్చి.. తర్వాత తంతానంటే ఊరుకుంటామా? టీఆర్ఎస్ అధిష్టానానికి బీజేపీ నేత స్వామిగౌడ్ వేసిన సూటి ప్రశ్న ఇది. తనకు అవమానాలు ఎదురౌతున్నందునే టీఆర్ఎస్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ తనకు మాట్లాడేందుకు కనీసం రెండు నిముషాల సమయం కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన స్వామిగౌడ్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.


మొదటి నుంచి పార్టీలో ఉన్న తనను పక్కన పెట్టి అప్పుడే పార్టీలోకి వచ్చినవారిని అందలమెక్కించారని స్వామిగౌడ్ చెప్పారు. అప్పటి వరకు పార్టీని దూషించినవారిని ఎలా ప్రోత్సహిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీకిలోకి రావడం సొంతింటికి వచ్చినట్లు ఉందన్నారు. గతంలో తాను సంఘ్ కార్యకర్తగా పనిచేశానన్నారు. ఆర్ఎస్ఎస్‌లో ఉన్నప్పుడు బీజేపీ నాయకులతో అనుబంధం ఉందని స్వామిగౌడ్ తెలిపారు.

Updated Date - 2020-11-27T20:03:45+05:30 IST