Simha horoscope yearly 28/12/2020

ABN , First Publish Date - 2020-12-28T23:15:57+05:30 IST

Simha horoscope yearly 28/12/2020

Simha horoscope yearly 28/12/2020

మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం ఆదాయం - 2 వ్యయం - 14 రాజపూజ్యం - 2 అవమానం - 2 సింహ రాశి వారు ఈ ఏడాది ఉగాది నుంచి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఆహారం, ఫార్మా, వైద్య రంగాల వారికి ఆర్థి కంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాల ప్రారంభంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ప్రయ త్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశీ గమన యత్నాలకు అవాంతరాలు ఎదురవుతాయి. జూన్‌- అక్టోబర్‌ మాసాల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ఆస్తిపాస్తుల కొనుగోలు విష యంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ ఏడాది 6, 7 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఫార్మా, ఆస్పత్రులు, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. హోటల్‌, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్‌, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు లాభి స్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. జూన్‌ 21-అక్టోబర్‌ 12ల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ఉద్యోగ యత్నాలకు, కొత్త వ్యాపారాలకు ఆటంకాలెదురవవచ్చు. శని 6వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులు మిత్రు లుగా మారతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. వ్యాపార విస్తరణకు ప్రయత్ని స్తారు. శని వక్రించిన మే 24 - అక్టోబర్‌ 19 తేదీల మధ్య పెట్టుబడుల్లో నష్టం సంభవించే అవకాశం ఉంది. రుణబాధలు అధికమవుతాయి. వ్యాపార రంగంలోని వారికి నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ రంగంలోని వారికి సహోద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి. ఉదర సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 10, 4 స్థానాల్లో రాహు కేతువుల సంచారం ఫలితంగా వాహనం నడిపే సమయంలో జాగ్రత్త అవసరం. ప్రస్తు తం చేస్తున్న వ్యాపారం లేదా ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. ఓరిమితో వ్యవహరిస్తే పనిచేసే చోటే మంచి గుర్తింపు పొందుతారు. అనుభవజ్ఞుల సహకారంతో అను కున్న లక్ష్యాలు సాధిస్తారు. స్నేహ, బాంధవ్యాలు పెం పొందుతాయి. ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీ మహావిష్ణువు ఆరాధన శుభాలను చేకూరుస్తుంది.

Updated Date - 2020-12-28T23:15:57+05:30 IST