-
-
Home » Miscellaneous » Shashi kumari GHMC Campaign
-
ప్రచారంలో దూకుడు పెంచిన అమీర్‌పేట్ టీఆర్ఎస్ అభ్యర్థి
ABN , First Publish Date - 2020-11-25T16:49:57+05:30 IST
అమీర్‌పేట్ సిట్టింగ్ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థి శేషుకుమారి ప్రచారంలో దూకుడు పెంచారు.

హైదరాబాద్: అమీర్‌పేట్ సిట్టింగ్ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థి శేషుకుమారి ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రజలతో మమేకమౌతూ స్పెడ్ పెంచారు. అమీర్‌పేట్‌లో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శేషుకుమారి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాట్లాడుతూ అమీర్‌పేట్ డివిజన్‌లో పండుగ వాతావరణం నెలకొందని, ఇక్కడ అంతా టీఆర్ఎస్సే ఉందని అన్నారు. అభివృద్ధి చేశాం కాబట్టే గెలుస్తామని నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు.. ప్రజలకు చేరువలో ఉన్నాయన్నారు. వరద సహాయంలో తమ డివిజన్‌లో అందనివాళ్లు చాలా తక్కువమంది ఉన్నారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ వరద సహాయం అందజేస్తామని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు తమకు పోటీయే కాదని శేషుకుమారి అన్నారు.