రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో...

ABN , First Publish Date - 2020-12-01T12:34:15+05:30 IST

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధి మైలార్‌దేవుపల్లి, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌ డివిజన్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు సోమవారం....

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో...

రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధి మైలార్‌దేవుపల్లి, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌ డివిజన్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు తమకు అనుకూలంగా లేని ప్రాంతాలలో డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిసింది. కొన్ని చోట్ల ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం, దాడులు చేసుకోవడం జరిగింది. మరి కొన్ని చోట్ల ప్రతర్థి పార్టీల నాయకులు డబ్బులు పంచుతున్న వారిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఆదివారం రాత్రి మైలార్‌దేవుపల్లి డివిజన్‌ మధుభన్‌ కాలనీలో డబ్బులు పంచుతున్నారని బీజేపీ మైలార్‌దేవుపల్లి డివిజన్‌ అభ్యర్థి తోకల శ్రీనివా్‌సరెడ్డి అక్కడికి వెళ్ళగా టీఆర్‌ఎస్‌ నాయకులకు, వారికి మధ్య గొడవ జరిగింది. అది పోలీసుస్టేషన్‌ వరకు వెళ్ళింది. అదే డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివాస్‌ రెడ్డి మహిళా సంఘాలు ఒక్కో గ్రూపునకు రూ. 6వేలు పంచుతూ తీసిన వీడియో వైరల్‌ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం ఉప్పర్‌పల్లిలో రాజేంద్రనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోరని శ్రీలతకు ఓటు వేయాలని ఇతర ప్రాంతాల వారు డబ్బులు పంచుతుండగా బీజేపీ నాయకులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం బీజేపీ నాయకులు పోలీసు వాహనం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-01T12:34:15+05:30 IST