నేడు శ్రీవారి ఆర్జితసేవల ఆన్‌లైన్‌ టికెట్ల కోటా విడుదల

ABN , First Publish Date - 2020-11-13T09:19:08+05:30 IST

శ్రీవారి కల్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించి టీటీడీ ఈనెల 13వ తేదీ ఉదయం 11గంటలకు ఆన్‌లైన్‌ (వర్చువల్‌)

నేడు శ్రీవారి ఆర్జితసేవల ఆన్‌లైన్‌ టికెట్ల కోటా విడుదల

తిరుమల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి కల్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించి టీటీడీ ఈనెల 13వ తేదీ ఉదయం 11గంటలకు ఆన్‌లైన్‌ (వర్చువల్‌) కోటాను విడుదల చేయనుంది. 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ సేవా టికెట్లను భక్తులు బుక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. టికెట్లు బుక్‌ చేసుకున్న గృహస్తులు శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేకంగా కేటాయించిన దర్శనం స్లాట్‌లో టికెట్లు పొందాల్సి ఉంటుంది.


రూ.వెయ్యి ధరతో కల్యాణోత్సవం టికెట్లు పొందిన గృహస్తులకు(ఇద్దరు) ఆ టికెట్టుపైనే ఉచితంగా దర్శనం కల్పిస్తారు. డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్ల ధర తక్కువగానే ఉండటంతో దర్శనం కావాలంటే అదనంగా రూ.300 చెల్లించి ప్రత్యేక స్లాట్‌లో దర్శనం టికెట్లు పొందాల్సి ఉంటుంది. సేవ పొందిన తేదీ నుంచి 90 రోజులలోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని గృహస్తులకు టీటీడీ కల్పిస్తోంది. ఈ నాలుగు సేవలకు సంబంధించి టికెట్లు పొందే భక్తులు తమ ఇళ్ల నుంచే ఎస్వీబీసీ(శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌) లైవ్‌ ద్వారా సేవలను వీక్షించాలి. సేవ నిర్వహణ సమయంలో అర్చకులు వీరి గోత్రనామాలను ఉత్సవర్ల చెంత ఉంచుతారు. 

Updated Date - 2020-11-13T09:19:08+05:30 IST