-
-
Home » Miscellaneous » Ponnam Prabhakar comments
-
బీజేపీ సిగ్గులేకుండా కాంగ్రెస్ నేతలకు వల వేస్తోంది: పొన్నం ప్రభాకర్
ABN , First Publish Date - 2020-11-21T18:10:08+05:30 IST
హైదరాబాద్: బీజేపీ సిగ్గులేకుండా కాంగ్రెస్ నేతలకు వల వేస్తోందని కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

హైదరాబాద్: బీజేపీ సిగ్గులేకుండా కాంగ్రెస్ నేతలకు వల వేస్తోందని కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గొడవలు సృష్టించేందుకు మతం పేరుతో బీజేపీ ముందుకెళ్తోందన్నారు. ఎంఐఎంను బూచిగా చూపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక గూటికి చెందినవేనన్నారు. ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో చేసిందేమీ లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.