శేరిలింగంపల్లిలో ప్రచారంలో దూసుకుపోతున్న రాగం నాగేందర్
ABN , First Publish Date - 2020-11-26T16:45:47+05:30 IST
శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

హైదరాబాద్: శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. డివిజన్‌లోని మసీద్ బండ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలను పూర్తి చేసి అభివృద్ధికి బాటలు వేసిన తనను ప్రజలు ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి తనను దీవించాలని ఓటర్లను కోరారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు తనను ఆదరిస్తున్నారని, అఖండ విజయంతో గెలిపిస్తామని చెబుతున్నారని నాగేందర్ అన్నారు.