పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది: ఎమ్మెల్సీ కవిత
ABN , First Publish Date - 2020-12-01T18:16:07+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కవిత కోరారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్దిని చూసి.. ఆలోచించి ఓటు వేయాలన్నారు. పోలింగ్ శాతం తగ్గిందన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా.. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని, పోలింగ్ బూత్‌లు పెరిగాయని కవిత అన్నారు. చలిగా ఉందని కొందరు బయటకు వచ్చినట్లు లేదని, కోవిడ్ నేపథ్యంలో కొంత పోలింగ్ శాతం తగ్గినప్పటికీ.. మధ్యాహ్నం నుంచి పోలింగ్ శాతం పెరుగుతుందని, గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుందని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.