మళ్లీ అవకాశమిస్తే నాళాలను బాగు చేయిస్తాం: మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2020-11-26T20:56:38+05:30 IST
టీఆర్ఎస్ పాలనలో భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్కు అవకాశమిస్తే నాళాలను బాగు చేయిస్తామని చెప్పారు. గండిపేటను మించిన చెరువును త్వరలో నిర్మిస్తామన్నారు. హైదరాబాద్లో రోజూ నీళ్లిచ్చే బాధ్యత తమదేన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినదానికంటే.. మనమే ఎక్కువ ఇచ్చామని కేటీఆర్ అన్నారు.