Mesham horoscope yearly 28/12/2020

ABN , First Publish Date - 2020-12-28T23:15:57+05:30 IST

Mesham horoscope yearly 28/12/2020

Mesham horoscope yearly 28/12/2020

అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం ఆదాయం - 8 వ్యయం - 14 రాజపూజ్యం - 4 అవమానం - 3 మేష రాశి వారు ఉగాది నుంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశముంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తి పాస్తులు పెంపొందించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడు తుంది. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాల వారికి ప్రోత్సాహకరం. శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరం. జూన్‌ - అక్టోబర్‌ మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. వృత్తి, వ్యాపా రాలలో ఆటంకాలెదురైనా చివరికి సత్ఫలితాలు సాధిస్తారు. గురువు ఈ ఏడాది మీ జన్మ రాశి నుంచి 10, 11 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా నూతన ఉద్యోగాలకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి అధిక లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. జూన్‌ 21 - అక్టోబర్‌ 12 తేదీల మధ్య ఖర్చులు అంచనాలు మించుతాయి. ఎవరి కైనా డబ్బు ఇస్తే సకాలంలో తిరిగి రాకపోవచ్చు. ఈ ఏడాది మీ జన్మ రాశి నుంచి 10వ స్థానంలో శని సంచారం ఫలితంగా నూతన ఉద్యోగ యత్నాలు ఫలి స్తాయి. ఆస్తులు పెంపొందించుకుంటారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొం టారు. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు అధికం. మధ్యవర్తి త్వాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. మే 24 - అక్టోబర్‌ 18 తేదీల మధ్య శని వక్రించిన కారణంగా వృత్తి, వ్యాపారాల్లో ఓరిమితో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విష యాల్లో ఆచితూచి వ్యవహరించాలి. షేర్ల లావాదేవీలు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మీ జన్మ రాశి నుంచి 2, 8 స్థానాల్లో రాహు కేతువుల సంచారం ఫలితంగా విలాసాల ఖర్చులు అధికం. రుణ దాతల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవ హారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. పన్నులు, బీమా, గ్రాట్యుటీ, రుణాల విష యాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త అనుబంధాల విష యంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

Updated Date - 2020-12-28T23:15:57+05:30 IST