ఏవోబీలో మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2020-11-13T09:16:43+05:30 IST

ఏవోబీలో మావోయిస్టులకు సంబంధించిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్టు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేశ్‌ కిలారీ తెలిపారు. ఒడిశా నిఘా వర్గాలకు

ఏవోబీలో మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

సీలేరు (విశాఖపట్నం జిల్లా), నవంబరు 12: ఏవోబీలో మావోయిస్టులకు సంబంధించిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్టు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేశ్‌ కిలారీ తెలిపారు. ఒడిశా నిఘా వర్గాలకు వచ్చిన సమాచారం మేరకు గురువారం స్వాభిమాన్‌ ఏరియాలోని జోడంబో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అరపొదర్‌, ఆండ్రాపల్లి గ్రామాల అటవీ ప్రాంతంలో డీవీఎస్‌, బీఎ్‌సఎఫ్‌, పోలీసు బలగాలతో గాలింపు చర్యలను నిర్వహించగా మావోయిస్టుల డంప్‌ లభ్యమైందని ఆయన తెలిపారు. ఈ డంప్‌లో 303 రౌండ్లు 93, 9 ఎంఎం పిస్టల్‌ రౌండ్లు 55, ఎలకా్ట్రనిక్‌ డిటోనేటర్లు 13, హ్యాండ్‌ గ్రెనేడ్లు 14, రెండు ల్యాండ్‌మైన్స్‌తోపాటు విప్లవ సాహిత్యం వంటి ఇతర సామగ్రి లభ్యమైనట్టు ఎస్పీ తెలిపారు.  

Updated Date - 2020-11-13T09:16:43+05:30 IST