కౌంటింగ్ కేంద్రాలవద్ద మూడంచల భద్రత: మహేష్ భగవత్

ABN , First Publish Date - 2020-12-03T16:22:01+05:30 IST

స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రతను సీపీ మహేష్ భగవత్ సమీక్షించారు.

కౌంటింగ్ కేంద్రాలవద్ద మూడంచల భద్రత: మహేష్ భగవత్

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రతను సీపీ మహేష్ భగవత్ సమీక్షించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కోసం పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆరు కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 30 వార్డులకు గాను 30 స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్నాయన్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర గట్టి బందోబస్తును ఏర్పాటు  చేస్తూ.. సీసీటీవీ కెమెరాలు పెట్టామని మహేష్ భగవత్ తెలిపారు. 


కాగా ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలో గురువారం ఉదయం రీపోలింగ్ ప్రారంభమైంది. మొత్తం ఓటర్లు 54,655 మంది కాగా..అందులో పురుషులు 27,889, స్త్రీలు 26,763, ఇతరులు ముగ్గురు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రీపోలింగ్ కోసం అధికారులు 69 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అలాగే 12 మంది మైక్రో అబ్జర్వర్‌‌లను నియమించారు. దాదాపు 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. గుర్తుల తారుమారుతో ఓల్డ్‌ మలక్‌పేటలో రీ పోలింగ్‌‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. 


గ్రేటర్‌లోని 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో విజేతలుగా నిలిచి గ్రేటర్‌ కౌన్సిల్‌లో అడుగు పెట్టేది ఎవరు..? అన్నది శుక్రవారం తేలనుంది. 30 కేంద్రాల్లోని 150 కౌంటింగ్‌ హాళ్లలో శుక్రవారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 74.12 లక్షల ఓట్లకుగాను 34.50 లక్షల ఓట్లు పోలయ్యా యి. 

Updated Date - 2020-12-03T16:22:01+05:30 IST