Kumbam horoscope yearly 28/12/2020

ABN , First Publish Date - 2020-12-28T23:15:57+05:30 IST

Kumbam horoscope yearly 28/12/2020

Kumbam horoscope yearly 28/12/2020

ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు ఆదాయం - 14 వ్యయం - 14 రాజపూజ్యం - 6 అవమానం - 1 కుంభ రాశి వారు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. ప్రమోషన్‌లు, కోరు కున్న చోటకు బదిలీలు సంభవం. గృహనిర్మాణం, స్థల సేకరణ చేస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజ యం సాధిస్తారు. సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. శుభకార్యాలు జరుగుతాయి. క్రీడలు, పరిశోధన, విద్యా రంగాల వారికి విజయం. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్‌ రంగాలవారికి శుభప్రదం. జూన్‌ - అక్టోబర్‌ మాసాల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. గురువు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్న ఫలితంగా విలాసాలకు, దూరప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. రాజకీయ నేతలకు అనుకూలమైన కాలం. సినీరంగాలకుచెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. టెక్స్‌టైల్స్‌, ఎగుమతులు, రవాణా, ఉన్నత విద్య, ఆడిటింగ్‌ రంగాల వారికి అనుకూలం. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. జూన్‌ 21 - అక్టోబర్‌ 12ల మధ్య ఊహించని ఖర్చులు వస్తాయి. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. పెట్టుబడుల విష యంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రతి పనికి ఆటంకాలెదురయ్యే అవకాశం ఉంది. 12వ స్థానంలో శని సంచారం ఫలితంగా రాబడి బాగున్నా ఖర్చులు అంతకంటే ఎక్కువగా ఉంటాయి. బది లీలు అసౌకర్యం కలిగిస్తాయి. రుణబాధలు పెరుగుతాయి. వృత్తిపరంగా సంచారం పెరుగుతుంది. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. అనుభ వజ్ఞుల సలహాలు పాటించి వ్యాపార రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. తీర్థయాత్రలు, దానధర్మాలు, విలాసాలకు ఖర్చు చేస్తారు. పెద్దల సలహాలతో ముందడుగు వేయాలి. మే 24- అక్టోబర్‌ 19 తేదీల మధ్య శని వక్రించిన ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. చిన్నపాటి శస్త్ర చికిత్సకు అవకా శం ఉంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు వాయిదా వేయ డం మంచిది. దూరప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. 4, 10 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆటంకాలు ఎదు ర్కొంటారు. ఆస్తిపత్రాల విషయంలో సమస్యలు ఎదురవు తాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. దంపతుల మధ్య అపోహలు, అపార్థాల కారణంగా మన శ్శాంతి లోపిస్తుంది. అశ్రద్ధ వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశముంది. ఓరిమితో వ్యవహరించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది.

Updated Date - 2020-12-28T23:15:57+05:30 IST