ప్రచారంలో మంత్రి కేటీఆర్ పంచ్ డైలాగ్స్

ABN , First Publish Date - 2020-11-25T17:08:03+05:30 IST

గులాబీ మొక్కకు అంటు కట్టినట్లు వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు.. అన్నట్లే మంత్రి కేటీఆర్ డైలాగులు..

ప్రచారంలో మంత్రి కేటీఆర్ పంచ్ డైలాగ్స్

హైదరాబాద్: గులాబీ మొక్కకు అంటు కట్టినట్లు వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు.. అన్నట్లే మంత్రి కేటీఆర్ డైలాగులు కొడుతున్నారు. బండి సంజయ్ పూరి బండెక్కితే.. కేటీఆర్ మాత్రం త్రివిక్రమ్ ట్రైనెక్కారు. అందుకే పంచ్‌లకు కౌంటర్ పంచ్‌లు ఫటా ఫట్ వేస్తున్నారు. రోజూ రోడ్ షోలు, మీటింగ్‌లతో క్యాంపెన్ అదరగొట్టేస్తున్నారు. బీజేపీ నేతలు వాడేది రివాల్వర్లనే.. కానీ రాముడు వాడేది ఏకే 47 అని టీఆర్ఎస్ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. ఆ రేంజ్‌లోనే కేటీఆర్ ప్రసంగాలు పంచ్ పటాకాల్లో పేలుతున్నాయి.


జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నువ్వంటే నువ్వంటూ నేతలు వాగ్భాణాలు సంధించుకుంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండాకులు ఎక్కువే తిన్నట్లు కనిపిస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కేటీఆర్ తనదైన శైలిలో ప్రత్యారోపణలు, తూటాలు పేలుస్తున్నారు. బండి సంజయ్‌ను ఏకంగా కొత్త బిచ్చగాడిగా పోల్చారు. అంతటితో ఆగకుండా బీజేపీ వారిని గోబెల్స్‌కు కజిన్ బ్రదర్స్ అంటూ కొత్త ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన మాత్రమే నడుస్తోందని, కేంద్ర మంత్రులకు కూడా తెలియపోవడం శోచనీయమన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు ఉందనుకోవడం హాస్యస్పదమన్నారు.

Read more