-
-
Home » Miscellaneous » Kartakam horoscope yearly 28/12/2020
-
Kartakam horoscope yearly 28/12/2020
ABN , First Publish Date - 2020-12-28T23:15:57+05:30 IST
Kartakam horoscope yearly 28/12/2020

పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష ఆదాయం - 14 వ్యయం - 2 రాజపూజ్యం - 6 అవమానం - 6 ఈ ఏడాది కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నుంచి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక పరమైన అభివృద్ధి కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కంపెనీ వాటాల విలువ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడు తుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. ఫార్మా, వైద్యం, ఆహార రంగాల వారికి ప్రోత్సా హకరం. జూన్ - అక్టోబర్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో నిదానం పాటించాలి. ఖర్చులు అంచనాలను మించిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. 7, 8 స్థానాల్లో గురుగ్రహ సంచారం ఫలితంగా వివాహయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ఉమ్మడి వ్యాపారాలు లాభిస్తాయి. స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి అనుకూలం. రాజకీయం, కళలు, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. గురువు వక్రగమనంలో వున్న జూన్ 21- అక్టోబర్ 12 మధ్య వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత చదువుల్లో మొదట ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక విషయాల్లో మోస పోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. సప్తమ స్థానమైన మకర రాశిలో శని సంచారం ఫలితంగా స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. వేడుకలు, శుభకార్యాలకు అవకాశం ఉంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మే 24 - అక్టోబర్ 18 తేదీల మధ్య గురువు వక్రించిన ఫలితంగా వైవాహిక జీవితంలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోని బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సి రావచ్చు. విలాసాలకు అధికంగా ఖర్చు చేస్తారు. బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి వస్తుంది. రుణబాధలు అధికం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించండి. 11, 5 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా ఆర్థికపరమైన నిర్ణయాల్లో తొందరపాటు తగదు. సంతానం అరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి. మనసు చంచలంగా ఉంటుంది. ఫలితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు. మీకు మంచి చెప్పేవారిని అపార్థం చేసుకుంటారు. స్నేహానుబంధాల మధ్య విభేదాలు ఏర్పడ తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల వారు నైపుణ్యాలను మెరుగు పరచుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభాలను చేకూరుస్తుంది.