-
-
Home » Miscellaneous » Kanya horoscope yearly 28/12/2020
-
Kanya horoscope yearly 28/12/2020
ABN , First Publish Date - 2020-12-28T23:15:57+05:30 IST
Kanya horoscope yearly 28/12/2020

ఉత్తర 2,3,4; హస్త; చిత్త1,2 పాదాలు ఆదాయం - 5 వ్యయం - 5 రాజపూజ్యం - 5 అవమానం - 2 కన్యా రాశి వారు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు, ఆ తరువాత నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఆర్థికపరమైన పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు శుభప్రదం. ఉన్నత చదువుల యత్నాలు, వివాహ యత్నాలు ఫలిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. న్యాయ, విదేశీ వ్యవహారాల వారికి ప్రోత్సాహ కరం. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆడిటింగ్, న్యాయ, సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు అందుకుంటారు. జూన్- అక్టోబర్ మాసాల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. చిన్నారుల వ్యవహారశైలి మనస్తాపం కలిగిస్తుంది. 5, 6 స్థానాల్లో గురువు సంచారం కారణంగా ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవి స్తాయి. ఉన్నత విద్యా యత్నాలు ఫలిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. గురువు వక్రగమనంలో ఉన్న జూన్ 21-అక్టోబర్ 12ల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఈ ఏడాది 5వ స్థానంలో శని సంచారం కారణంగా వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కష్టంలో వున్న వారికి సాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. భారీ ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. డబ్బు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరాశకు గురవుతారు. శని వక్రగమనంలో వున్న మే 24 - అక్టోబర్ 19ల మధ్య విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వైద్యం, కేటరింగ్, రిటైల్, హోటల్ రంగాల వారికి శుభప్రదం. ఉదర సంబంధ సమస్యలకు అవకాశం ఉంది. చిన్న శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. 9, 3 స్థానాల్లో రాహు-కేతు గ్రహాల సంచారం ఫలి తంగా ఉద్యోగంలో బదిలీలకు అవకాశం ఉంది. న్యాయపర మైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయంలో మధ్యవర్తిత్వం కార ణంగా ఇబ్బందులు పడతారు. అవసరంలో వున్న వారికి సాయం చేస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. దూర ప్రయాణాలకు అనుకూలం. ఏడాది మొదట్లో కొన్ని చికా కులు ఎదురైనా తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన శుభప్రదం.