‘ఓటెయ్యడమనేది ఇంపార్టెంట్..ఎలా వేశామన్నది కాదు’
ABN , First Publish Date - 2020-12-01T19:52:21+05:30 IST
సినీహీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్: సినీహీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవడం మన హక్కన్నారు. ఓటు ఉన్నవారు తప్పకుండా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. అయితే గతంలో ఈవీఎంలో ఓటు వేశామని, ఇప్పుడు బ్యాలెట్‌లో ఓటు వేయడం ఎలా ఉందన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా.. ఓటేయడం ఇంపార్టెంట్ అని.. ఎలా వేశామన్నది ముఖ్యంకాదని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు.