మహిళా మేయర్.. అంతా తయార్..!

ABN , First Publish Date - 2020-12-01T12:23:08+05:30 IST

అటు కుటుంబం.. ఇటు ఆఫీస్‌, అటు కరోనా... ఇటు విధి నిర్వహణ. ఇన్నిటి మధ్య.. బ్యాలెన్స్‌ తప్పకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మహిళలు...

మహిళా మేయర్.. అంతా తయార్..!

మొత్తం డివిజన్లు 150

50 శాతం మహిళలకు రిజర్వేషన్‌

అంటే 75 డివిజన్లు మహిళలవి

ఇతర స్థానాలలో కూడా మహిళలు గెలిచే అవకాశం

డ్రా ప్రకారం...

పదేళ్ల పాటు మహిళకు మేయర్‌ స్థానం

మహిళా ఓట్లు 35, 65, 896

పోటీలో ఉన్న అభ్యర్థులు 1122

వారిలో మహిళలు 541


అటు కుటుంబం.. ఇటు ఆఫీస్‌, అటు కరోనా... ఇటు విధి నిర్వహణ. ఇన్నిటి మధ్య.. బ్యాలెన్స్‌ తప్పకుండా బాధ్యతలు  నిర్వహిస్తున్నారు మహిళలు. ఎన్నికల విధులకు తరలివచ్చిన సిబ్బందిలో ప్రతి చోటా మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం స్పష్టంగా కనిపించింది. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల దాకా... అడుగడుగునా అతివలు. అష్టకష్టాల కోర్చి ఎలెక్షన్‌ డ్యూటీలకు తరలి వస్తున్న దృశ్యాలను ఫొటోలలో చూడొచ్చు. చంటిపిల్లలను చూసేవారెవరూ కుటుంబంలో లేక.. వారితోనే డ్యూటీలకు విచ్చేసిన స్ర్తీలను చూస్తే.. వారి ఓర్పు, బాధ్యతల పట్ల అంకితభావానికి గౌరవంతో వందనం చేయని వారెవరూ ఉండరేమో!  చట్ట ప్రకారం ఈసారి హైదరాబాద్‌ మేయర్‌ స్థానం మహిళది. 2020 నుంచి 2025 దాకా.. అయిదేళ్లు ఆమె సిటీకి నాయకత్వం వహిస్తారు. ఓ మహిళను మేయర్‌ చేయబోతున్న ఈ ఎన్నికల విధుల్లో.. అన్ని అంచెలలో అతివల క్రియాశీల భాగస్వామ్యాన్ని ఫొటోలు ప్రతిబింబిస్తున్నాయి.

Updated Date - 2020-12-01T12:23:08+05:30 IST