-
-
Home » Miscellaneous » ghmc elections
-
చివరి రోజు భారీగా నామినేషన్‌లు
ABN , First Publish Date - 2020-11-21T18:19:53+05:30 IST
చివరి రోజు శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ మూడో జాబితా గురువారం అర్ధరాత్రి విడుదలైంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా వెల్దండ వెంకటేష్

హైదరాబాద్: చివరి రోజు శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ మూడో జాబితా గురువారం అర్ధరాత్రి విడుదలైంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా వెల్దండ వెంకటేష్ పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. శుక్రవారం ఆయన ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం ఫిలింనగర్ బస్తీలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. వెంకటేశ్వరనగర్‌కాలనీ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా దొరపల్లి స్వప్నను ఎంపిక చేశారు.
సనత్‌నగర్‌లో..
బేగంపేట: సనత్‌నగర్ నియోజకవర్గంలో అన్ని డివిజన్ల నుంచి ఆయా పార్టీల అభ్యర్థులందరూ శుక్రవారం నామినేషన్లు వేశారు. బేగంపేట డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి టి. మహేశ్వరి శ్రీ కేసరి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్, ఎమ్మెల్యే రేఖానాయక్, నాయకుడు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి రాజలక్ష్మి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎ. మంజులారెడ్డి అనుచరులతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు వాహెద్ సోదరి ఫరానా బేగం నామినేషన్ వేశారు.
ఉత్తర మండల కార్యాలయంలో..
రాంగోపాల్‌పేట్: ప్రధాన పార్టీల అభ్యర్థులు జీహెచ్‌ఎంసీ ఉత్తర మండల కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జోత్స్నకు నామినేషన్ పత్రాలను శుక్రవారం సమర్పించారు. టీఆర్‌ఎస్ తరపున సిట్టింగ్ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివా్‌సగౌడ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేయించి మద్దతు దారులతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి చీర సుచిత్ర రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు, సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చీర శ్రీకాంత్‌తో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ తరపున టీపీసీసీ కార్యదర్శి శీలం ప్రభాకర్ సతీమణి కవిత మద్దతు దారులతో వెళ్లి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సనత్‌నగర్ నియోజకవర్గం ఎ-బ్లాక్ ఉపాధ్యక్షుడు త్రికాల మనోజ్‌కుమార్ తన సతీమణి అనుపమను పోటీ చేయిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా అఖిల భారతీయ దోభీ మహాసంఘ్ తెలంగాణ ఆర్గనైజింగ్ కార్యదర్శి మాణిక్య బండారం రాజు సతీమణి రేఖను పోటీలో దించారు.
హిమాయత్‌నగర్ డివిజన్..
హిమాయత్‌నగర్: హిమాయత్‌నగర్ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి గడ్డం మహాలక్ష్మి, టీఆర్‌ఎస్ నుంచి జడల హేమలతయాదవ్, కాంగ్రెస్ నుంచి జువ్వాడి ఇందిరారావు, టీడీపీ తరఫున నల్లెల్ల పద్మజ నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరారావు పేరు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. పెద్దగా పోటీ లేకపోవడంతో ఆమెనే అభ్యర్థిగా ప్రకటిస్తారని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. టీడీపీ నుంచి పద్మజ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీపీఐ నుంచి ఛాయాదేవి కూడా మొదటిసారి పోటీ చేస్తున్నారు.
ఖైరతాబాద్ సర్కిల్‌లో 37
జూబ్లీహిల్స్ సర్కిల్‌లో 52 నామినేషన్లు
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని ఖైరతాబాద్‌లో 7, సోమాజిగూడలో 13, అమీర్‌పేటలో 10, సనత్‌నగర్‌లో 7 నామినేషన్లు దాఖలు కాగా.. జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోని బంజారాహిల్స్‌లో 15, వెంకటేశ్వరకాలనీలో 10, షేక్‌పేటలో 14, జూబ్లీహిల్స్‌లో 13 నామినేషన్లు దాఖలయ్యాయి.
సోమాజిగూడ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా వనం సంగీతా యాదవ్, బీజేపీ నుంచి చిట్టిబోయిన విజయదుర్గ, గుంటి విజయదుర్గ, కాంగ్రెస్ నుంచి ఎన్. శ్వేత, అనిత, టీడీపీ నుంచి సోమ శ్రీదేవి, నాసం మాధవి, టి. యశోద, ఇండిపెండెంట్‌గా కూన స్నేహలత నామినేషన్లు వేశారు.
అమీర్‌పేట నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున సిట్టింగ్ కార్పొరేటర్ శేషుకుమారి, బీజేపీ నుంచి కేతినేని సరళ, ఉండవల్లి సుప్రియ, కాంగ్రెస్ నుంచి చుక్కా సుద, సి. శైలజ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నుంచి ఎవరూ వేయలేదు. ఇండిపెండెంట్లుగా ఎన్. దివ్య, సాహితి, ఐల స్వాతి నామినేషన్లు దాఖలు చేశారు.
సనత్ నగర్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ తరఫున కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, బీజేపీ నుంచి కంజర్ల అన్నపూర్ణ, కాంగ్రెస్ నుంచి తన్వీర్, టీడీపీ తరఫున బి. సుధారాణి, కానూరి జయశ్రీ, ఇండిపెండెంట్లుగా కె.దీపిక, పి.వైష్ణవి నామినేషన్లు వేశారు.
జూబ్లీహిల్స్ సర్కిల్‌లో..
వెంకటేశ్వర కాలనీ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ తరఫున మన్నె కవితారెడ్డి, బీజేపీ నుంచి బి. ఉమ, టీడీపీ నుంచి వై. దేవి, కె. శశికళ, డి. స్వప్న, కాంగ్రెస్ తరఫున బి. రమ్య, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఫౌజియా ఖనమ్, అస్రా ఫాతిమా నామినేషన్లు వేశారు.
బంజారాహిల్స్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ తరఫున గద్వాల విజయలక్ష్మి నామినేషన్ వేయగా. శుక్రవారం మరో ముగ్గురు రెబల్ అభ్యర్థులుగా నక్కా రఘు ముదిరాజ్, బర్ల నాగరాజు, జె. శివకుమార్ ముదిరాజ్, బీజేపీ నుంచి బద్దం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున కొప్పుల కళ్యాణ్‌కుమార్, ధన్‌రాజ్ రాథోడ్, గొల్లోల్ల నాగరాజు, కవ్వెడ రామకృష్ణ, టీడీపీ నుంచి ఎస్. సుజాత, ఇండిపెండెంట్లుగా షేక్ ఇమ్రాన్, కోట రాములు, జె. రాజు, లింగాల లక్ష్మణరావు, మహ్మద్ అబ్దుల్ అజీం, కె. రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు.
షేక్‌పేట డివిజన్‌లో బీజేపీ నుంచి కె. మోహన్‌రెడ్డి, కె. రాఘవరెడ్డి, జి. శివకుమార్‌రెడ్డి, చెర్క మహేష్, టీడీపీ నుంచి ఎం. విఘ్నేష్, బహుజన ముక్తి పార్టీ నుంచి మహ్మద్ అబ్దుల్ ఖయ్యూం, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మహ్మద్ జుబేరుద్దీన్, సీపీఐ తరఫున షేక్ శంషుద్దీన్ అహ్మద్, ఇండిపెండెంట్లుగా మహ్మద్ అబు బాకర్ ఫర్వేజ్ సిద్దిఖీ నామినేషన్ వేశారు.
జూబ్లీహిల్స్ డివిజన్‌లో కాంగ్రెస్ తరఫున దీటి వంశీకృష్ణ, కె. రమేష్, బీజేపీ నుంచి దేరంగుల వెంకటేష్, జి. అరుణ్‌కుమార్, వి. శంకర్, కాంగ్రెస్ తరఫున దీటి వంశీకృష్ణ, కె. రమేష్, టీడీపీ నుంచి ఎం. నరసింహులు, ఐఎన్‌వై జేపీ పార్టీ నుంచి కరన్ మహంత్, సీపీఐ నుంచి డి. కృష్ణకుమారి, ఇండిపెండెంట్‌గా అభ్యర్థిగా ఒకరు, ఇప్పటికే టీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, బీజేపీ నుంచి పల్లపు గోవర్ధన్, కాంగ్రెస్ తరఫున మహేందర్ బిరాదర్ నామినేషన్ వేశారు.
భారీ ర్యాలీగా వెళ్లి విజయారెడ్డి నామినేషన్
ఖైరతాబాద్: మేయర్ ఆశావహురాలిగా సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న విజయారెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. మొదట ఖైరతాబద్ గణపతి ప్రాంగణంలో పూజలు చేసిన ఆమె మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, డివిజన్ ఇన్‌చార్జి లక్ష్మణరావు, మాజీ కార్పొరేటర్ కృష్ణయాదవ్, నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రంథాలయ చైరస్తాలోని తన తండ్రి పీజేఆర్ విగ్రహం వద్ద, మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించి బయలుదేరారు.
వెంగళరావునగర్: జీహెచ్‌ఎంసీ నామినేషన్ ఘట్టం చివరిరోజు ముగిసింది. శుక్రవారం 45 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొత్తం 66 మంది 94 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
యూసు్‌ఫగూడ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ తరపున బి. రాజ్‌కుమార్, జి. కైలాసం, టీడీపీ నుంచి రమే్‌షకుమార్, బాలరంగ మోహన్‌రావు, కాంగ్రెస్ పార్టీ తరఫున సత్యనారాయణ, బీజేపీ నుంచి కె. గంగరాజు, రాహుల్‌దేశ్‌పాండే, ఐదుగురు ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు.
ఎర్రగడ్డ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కె. పల్లవి, ఎంఐఎం అభ్యర్థిగా సబీహాబేగం, నసీం బేగం, సీపీఐ నుంచి యాస్మిన్ బేగం, కాంగ్రెస్ అభ్యర్థిగా నౌషీన్‌బేగం, బీజేపీ నుంచి బి. రూప, ప్రసన్నతోపాటు మరో నలుగురు ఇండిపెండెంట్లు నామినేషన్ దాఖలు చేశారు.
వెంగళరావునగర్ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కిలారి మనోహర్, టీఆర్‌ఎస్ నుంచి జి. దేదీప్య, పి. విజయ్‌కుమార్, కాంగ్రెస్ తరపున స్వరూపకుమారి, బి. సుశీల్‌కుమార్, జింకా అలీస్, ఆప్ అభ్యర్థిగా జిట్టా రామ్‌తోపాటు ఐదుగురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు.
బోరబండ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బాబాఫసియుద్దీన్, బీజేపీ నుంచి ఎం. శ్రీనివా్‌సగౌడ్, ప్రసన్నకుమార్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
రహ్మత్‌నగర్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ తరఫున సీఎన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా బండపల్లి భవానీశంకర్, బీజేపీ నుంచి కె. వెంకటేష్, నరేందర్, ఎంఐఎం అభ్యర్థులుగా మహ్మద్ సులేమాన్, హెచ్. సత్యనారాయణ, సీపీఎం నుంచి జె. స్వామి, తొమ్మిదిమంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.