కోర్టుల జోక్యం తగదు.. ఎస్ఈసీ రివ్యూ పిటిషన్

ABN , First Publish Date - 2020-12-04T17:12:16+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎన్నికల సంఘం గురువారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టి వేసిన విషయం తెలిసిందే.

కోర్టుల జోక్యం తగదు.. ఎస్ఈసీ రివ్యూ పిటిషన్

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎన్నికల సంఘం గురువారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టి వేసిన విషయం తెలిసిందే. స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఎన్నికల సంఘం వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని ఎన్నికల సంఘం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తోంది. ఈ రివ్యూ పిటిషన్‌ను స్వీకరించాలంటూ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయనుంది.

Updated Date - 2020-12-04T17:12:16+05:30 IST