-
-
Home » Miscellaneous » Danasu horoscope yearly 28/12/2020
-
Danasu horoscope yearly 28/12/2020
ABN , First Publish Date - 2020-12-28T23:15:57+05:30 IST
Danasu horoscope yearly 28/12/2020

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం ఆదాయం - 11 వ్యయం - 5 రాజపూజ్యం - 7 అవమానం - 1 ఈ రాశి వారు ఉగాది నుంచి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. సంతానం విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురైనా చివరకు పట్టుదలతో అభివృద్ధి సాధిస్తారు. సొంత ఇల్లు, లేదా స్థలం సమకూర్చుకుంటారు. పై అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. బంధుమిత్రుల సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తారు. జూన్ - అక్టోబర్ మాసాల మధ్య రుణయత్నాలు ఫలించకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. రెండవ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. సృజనాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ప్రస్తుత వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీ, ఆడిటింగ్ రంగాల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడుతుంది. జూన్ 21 - అక్టోబర్ 12 తేదీల మధ్య గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపారాల్లో నిదానం పాటించాలి. పెట్టుబడులపై ఆశించిన ప్రతిఫలాలు రాకపోవచ్చు. 2వ స్థానంలో శని సంచారం ఫలితంగా వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు అధికం. ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిత్వం కారణంగా మాటపడాల్సి వస్తుంది. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురైనా చివరకు మంచి ఫలితాలు సాధిస్తారు. శని వక్రగమనంలో ఉన్న మే 24 - అక్టోబర్ 19ల మధ్య ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు బాధి స్తాయి. మనసు చికాకుగా ఉంటుంది. 6, 12 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పై అధికారుల నుంచి ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. ఉన్నత చదువు లకు ఆటంకాలెదురవుతాయి. అనవసర ఖర్చులు అధికం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ ఆంజనేయ స్తోత్రం, శ్రీ రామరక్షా పారాయణం శుభప్రదం.