Danasu horoscope weekly date 18/03/2020

ABN , First Publish Date - 2020-03-18T15:47:59+05:30 IST

Danasu horoscope weekly date 18/03/2020

Danasu horoscope weekly date 18/03/2020

వేడుకలు, పెట్టుబడులు, విద్య, వ్యాపారాలపై ఈ వారం దృష్టి పెడతారు. బుధవారం రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. 19, 20, 21 తేదీల్లో చిన్నారులు, ప్రియతముల వ్యవహారాల్లో శుభపరిణమాలు సంభవం. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ప్రయాణాల్లో నిదానం అవసరం. 22, 23 తేదీల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. బదిలీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువులు కొనుగోలు సమయంలో నాణ్యత పాటించాలి. 24న చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి.

Updated Date - 2020-03-18T15:47:59+05:30 IST