-
-
Home » Miscellaneous » Criminal Candidates In Greater Elections
-
ఏబీఎన్ చేతిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల లిస్ట్
ABN , First Publish Date - 2020-11-25T21:17:57+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల జాబితా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంపాదించింది.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల జాబితా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంపాదించింది. మొత్తం 49 మంది అభ్యర్థులపై 96 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేరచరితుల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. బీజేపీ నుంచి 17 మంది, కాంగ్రెస్ నుంచి 12 మంది, టీఆర్ఎస్ నుంచి 13 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు ఈ జాబితాలో ఉన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యర్థుల నేర చరితను బయటపెడుతుంది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరితకు సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక నివేదికను బయటపెట్టింది.