-
-
Home » Miscellaneous » Bandi Sanjay
-
ప్రచారంలో ‘పూరి జగన్నాథ్ డైలాగ్స్ తో’బండి సంజయ్
ABN , First Publish Date - 2020-11-25T15:43:04+05:30 IST
‘ఎవ్వరికీ భయపడకు.. దేనికీ భయపడకు, నీకు నువ్వే తోపు.. ఎక్కడా తగ్గకు’ ఇలా..

హైదరాబాద్: ‘ఎవ్వరికీ భయపడకు.. దేనికీ భయపడకు, నీకు నువ్వే తోపు.. ఎక్కడా తగ్గకు’ ఇలా దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్లే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెలరేగిపోతున్నారు. పంచ్ డైలాగ్‌లతో పరేషాన్ చేసే సబ్జెక్టులతో హీట్ పుట్టిస్తున్నారు. తప్పా, ఒప్పా, డోంట్ కేర్.. డైలాగ్ వేస్తే పేలాల్సిందే అన్నట్లుగా సంజయ్ సెగలు పుట్టిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఒక్కో రోజు ఒక్కో డైలాగ్‌తో మొత్తం క్యాంపెన్‌ను ఇస్మార్ట్ సంజయ్ తనవైపు తిప్పేసుకుంటున్నారు.
ఒకే ఒక్క డైలాగ్ గ్రేటర్ ప్రచారాన్ని మలుపు తిప్పింది. అసలు విషయం కాస్త పక్కదారిపట్టింది. అందరి దృష్టి అటువైపు మళ్లించింది. సీఎం కేసీఆర్ లాంటి వాళ్లు గంట సేపు మాట్లాడి గ్రేటర్ దృష్టిని తనవైపు తిప్పుకున్నారన్న సమయంలో నగరవాసులకు నీళ్లు ఫ్రీ అంటూ ఇచ్చిన మేనిఫెస్టోపై చర్చ జరుగుతుందగానే.. బండి సంజయ్ సర్జికల్ స్ట్రయిక్ వ్యాఖ్యలతో టాపిక్ మారిపోయింది. మంత్రి కేటీఆర్ రోజూ ఇచ్చే స్పీచ్‌లు, ముఖ్యమంత్రి గంట సేపు ఇచ్చిన వరాలన్నీ సర్జికల్ స్ట్రయిక్ సర్వనాశనం అయిపోయాయి.
‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేం గెలిచి.. మేయర్ పీఠం దక్కించుకుంటే బిడ్డా.. పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రయిక్ చేసి పాకిస్థానీలు, రోహింగ్యాలను ఇక్కడి నుంచి తరమితరమి కొట్టే బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది’ అని బండి సంజయ్ హెచ్చరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ పోరాడుతుందని, జనాభాలో 80శాతం ఉన్న ప్రజల మనోభావాలు, సంక్షేమం కోసం పాటుపడుతుందని సంజయ్ పేర్కొన్నారు. ముస్లిం ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్న వాళ్లు లౌకికవాదులు ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. తన నోటి నుంచి హిందుస్థాన్ అనే పదాన్ని పలకనని ఓ ఎమ్మెల్యే అన్నారని, అలాంటి వారి పార్టీ అవసరమా? అని ప్రశ్నించారు.