అమరావతిపై కుట్రలు మానుకోవాలి
ABN , First Publish Date - 2020-11-13T09:16:10+05:30 IST
అమరావతిపై కుట్రలు, కుతంత్రాలు ఎన్నాళ్లో సాగవని.., వాటిని మానుకొని అభివృద్ధి కొనసాగే విధంగా పని చేయాలని రాజధానికి భూములిచ్చిన రైతులు
331వ రోజుకు చేరిన ఆందోళనలు
తుళ్లూరు, నవంబరు 12: అమరావతిపై కుట్రలు, కుతంత్రాలు ఎన్నాళ్లో సాగవని.., వాటిని మానుకొని అభివృద్ధి కొనసాగే విధంగా పని చేయాలని రాజధానికి భూములిచ్చిన రైతులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని మూడు రాజధానులు ప్రతిపాదన మానుకోవాలని వారు చేస్తున్న ఆందోళనలు గురువారానికి 331వ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానులంటూ పెయిడ్ ఆర్టిస్టుల చేత శిబిరం ఏర్పాటు చేసి దీక్షలు చేయించటం సిగ్గు చేటన్నారు. రాజధాని అమరావతిపై కుట్రలో ఇదొక భాగమన్నారు. రాజధాని 29 గ్రామాలలో అమరావతి కొనసాగాలని ఆందోళనలు నిర్వహించారు. రాత్రి ఏడు గంటల సమయంలో కొవ్వొత్తులు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు.