అరకు నుంచి వచ్చి ఓటు వేసా..: రాజేంద్రప్రసాద్

ABN , First Publish Date - 2020-12-01T17:18:57+05:30 IST

ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు.

అరకు నుంచి వచ్చి ఓటు వేసా..: రాజేంద్రప్రసాద్

హైదరాబాద్: ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ సూచించారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను అరకులో షూటింగ్‌లో ఉన్నానని అయినా.. ఓటు వేయడం కోసం హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. ప్రశ్నించే హక్కు మనకు రావాలంటే.. మనం తప్పకుండా ఓటు వేస్తేనే ఆ హక్కు ఉంటుందని, ఇది తన అభిప్రాయమని చెప్పారు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కులేదన్నారు. ఇక్కడ పోలింగ్ బూత్‌ ఖాళీగా ఉండడం చాలా బాధగా ఉందన్నారు. ఇప్పటికైనా అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజేంద్రప్రసాద్ పిలుపు ఇచ్చారు.

Updated Date - 2020-12-01T17:18:57+05:30 IST