హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీలు హద్దు మీరుతున్నాయా?

ABN , First Publish Date - 2020-11-22T02:05:24+05:30 IST

నగరంలో ఎన్నికల హీట్ పీక్ స్టేజ్‌కు చేరింది. ఆదివారం నామినేషన్ల విత్ డ్రాలు ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. పార్టీ సీనియర్ నాయకులందరూ...

హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీలు హద్దు మీరుతున్నాయా?

హైదరాబాద్‌: నగరంలో ఎన్నికల హీట్ పీక్ స్టేజ్‌కు చేరింది. ఆదివారం నామినేషన్ల విత్ డ్రాలు ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. పార్టీ సీనియర్ నాయకులందరూ గల్లీల్లో తిరుగుతున్నారు. అయితే పార్టీలు శృతి మించి ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పక్కన్న పెట్టి రెచ్చ గొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్‌లో మూడు, నాలుగు దశాబ్దాల క్రితం ప్రజలను రెచ్చిగొట్టే వాతావరణాన్ని మళ్లీ తీసుకురావాలని, ప్రజలను భయపెట్టాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘‘హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీలు హద్దు మీరుతున్నాయా?. ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాయా..?. టీఆర్ఎస్ కావాలనే బీజేపీని టార్గెట్ చేసిందా?. బీజేపీ ఎందుకు ఎంఐఎంను ప్రత్యర్థిగా ఎంచుకుంది...?. పార్టీ వైఖరి హైదరాబాద్ అభివృద్ధికి పనికొస్తుందా?.  అన్నీ తెలిసిన హైదరాబాదీలు ఎందుకు ఓటు వెయ్యరు..?. ప్రతి ఒక్కరూ ఓటు వేయకపోతే జరిగే నష్టం ఏంటి..?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Read more