డిప్లొమా కోర్సులకు పాలిసెట్‌తో ప్రవేశాలు
ABN , First Publish Date - 2020-05-13T16:24:49+05:30 IST
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) లో వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరానికి పాలిసెట్-2020 ప్రవేశ పరీక్ష

హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) లో వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరానికి పాలిసెట్-2020 ప్రవేశ పరీక్ష ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని వర్సిటీ తెలిపింది. ఈ విషయాన్ని వర్సిటీ రిజిస్ర్టార్ సుధీర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందాలని భావించే విద్యార్థులు తప్పనిసరిగా ప్రవేశ పరీక్షకు హాజరుకావాలని ఆయన సూచించారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ మార్చి 2న విడుదల చేసిందని తెలిపారు.
ప్రభుత్వ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులతో పాటు పీజేటీఎ్‌సఏయూలోని నాలుగు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కూడా పాలిసెట్ మార్గదర్శక సూత్రాల్లో పొందుపరిచామని చెప్పారు. పాలిసెట్- 2020 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 31 చివరి తేదీ అని వెల్లడించారు మరిన్ని వివరాలకు www.po-lycetts.nic.in, www.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లు చూడాలని రిజిస్ర్టార్ సూచించారు.