టీఆర్టీలో విద్యా వలంటీర్లకు వెయిటేజీ ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-12-19T16:04:45+05:30 IST
త్వరలో ప్రభుత్వం చేపట్టనున్న ఉపాధ్యాయుల నియామకాల్లో విద్యావాలంటీర్లకు వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ విద్యావాలంటీర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ

హైదరాబాద్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): త్వరలో ప్రభుత్వం చేపట్టనున్న ఉపాధ్యాయుల నియామకాల్లో విద్యావాలంటీర్లకు వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ విద్యావాలంటీర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అనుభవం ఉన్నందున ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మఠం శివానందస్వామి, అధ్యక్షుడు జోగినాథ్ యాదవ్, కార్యనిర్వాహక అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి సత్యేందర్ కోరారు.
వీరు శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సాధ్యమైనంత త్వరగా పాఠశాలలు తెరవాలని, విద్యావాలంటీర్లను కొనసాగిస్తూ ఉత్వర్వులు ఇవ్వాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. గత విద్యాసంవత్సరంలో చెల్లించని 3నెలల గౌరవ వేతనం బకాయిలను వెంటనే విడుదలచేయాలని కోరారు.