నేటి నుంచి ‘ఇంజనీరింగ్‌’ వెబ్‌ ఆప్షన్లు

ABN , First Publish Date - 2020-12-28T15:50:53+05:30 IST

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంసెట్‌ ర్యాంకర్లకు సోమవారం వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 28, 29 తేదీల్లో 1 నుంచి 60

నేటి నుంచి ‘ఇంజనీరింగ్‌’ వెబ్‌ ఆప్షన్లు

నేడు, రేపు 1- 60 వేల ర్యాంకు వరకు

60,001 నుంచి చివరి ర్యాంకు వరకు 30, 31న

1న ఆప్షన్లలో మార్పులు 3న సీట్ల కేటాయింపు

 

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంసెట్‌ ర్యాంకర్లకు సోమవారం వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 28, 29 తేదీల్లో 1 నుంచి 60 వేల ర్యాంకు వరకు, 30, 31 తేదీల్లో 60,001 నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. జనవరి 1న కొత్త ఆప్షన్లు/ఆప్షన్లలో మార్పులకు అవకాశం ఉంటుంది. 3న సీట్లు కేటాయిస్తారు. కొత్త అభ్యర్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించేందుకు, సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకునేందుకు 28నుంచి 31 వరకు అవకాశం ఉంది. స్పెషల్‌ కేటగిరీ (పీహెచ్‌, ఎన్‌సీసీ, కాప్‌, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌) అభ్యర్థులు 29న విజయవాడలోని గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌లో, జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 28 నుంచి 31వరకు అన్ని హెల్ప్‌లైన్‌ సెంటర్లలో ధ్రువపత్రాలు వెరిఫికేషన్‌ చేయించుకోవాలని ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ నాయక్‌ సూచించారు. 


కళాశాలల్లో సీట్ల వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 257 ఇంజనీరింగ్‌ కళాశాలల్లోని 1,30,456 సీట్లను భర్తీ చేయనున్నారు. అందులో కన్వీనర్‌ కోటా కింద 92,882 సీట్లు, మేనేజ్‌మెంట్‌ కోటాలో 37,574 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో 18 వర్సిటీ కళాశాలల్లో 5,212 సీట్లు ఉండగా, ఇవన్నీ కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. 239 ప్రైవేట్‌ కాలేజీల్లో 1,25,244 సీట్లుకు గాను 87,670 సీట్లు కన్వీనర్‌ కోటా కింద, 37,574 సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా కింద భర్తీ చేస్తారు. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌లో 43,006, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో 31,154, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌లో 15,226, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 18,656, సివిల్‌ ఇంజనీరింగ్‌లో 14,134, ఇతర కోర్సుల్లో 8,280 సీట్లు ఉన్నాయని ఎం.ఎం.నాయక్‌ మరో ప్రకటనలో వివరించారు.


Updated Date - 2020-12-28T15:50:53+05:30 IST