బీ, సీ కేటగిరీలకూ వెబ్‌ ఆప్షన్లే

ABN , First Publish Date - 2020-11-19T17:01:11+05:30 IST

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ఐ కోటాల (బీ, సీ కేటగిరీలు) కింద ప్రవేశాలు

బీ, సీ కేటగిరీలకూ వెబ్‌ ఆప్షన్లే

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయం

హైదరాబాద్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ఐ కోటాల (బీ, సీ కేటగిరీలు) కింద ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఈసారి వెబ్‌ ఆప్షన్ల ద్వారానే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. వాస్తవానికి ప్రవేశాల సందర్భంగా కన్వీనర్‌ కోటాకు మాత్రమే వెబ్‌ ఆప్షన్‌ ఉంటుంది. బీ, సీ కేటగిరీలకు ఉండదు. విద్యార్థులు ఎంచుకున్న కళాశాలల్లో సీటు పొందాలంటే కౌన్సెలింగ్‌కు హాజరు తప్పనిసరి.


అయితే, కరోనా నేపథ్యంలో బీ, సీ కేటగిరీ విద్యార్థులకూ వెబ్‌ ఆప్షన్స్‌ ద్వారానే ప్రవేశాలు కల్పించనున్నారు. మరోవైపు అఖిల భారత కోటా, ఎయిమ్స్‌, డీమ్డ్‌ వర్సిటీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల రెండో విడత కౌన్సెలింగ్‌  షెడ్యూల్‌ ప్రారంభాన్ని 20వ తేదీకి మార్చారు.  


Updated Date - 2020-11-19T17:01:11+05:30 IST