జూన్‌ 20 నుంచి యూజీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-30T16:38:48+05:30 IST

కరోనా నేపథ్యంలో వాయిదాపడిన అండర్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ పరీక్షల నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా

జూన్‌ 20 నుంచి యూజీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు

వ్యవధి రెండు గంటలే.. ఈ ఏడాదికే వర్తింపు

ఆన్‌లైన్‌లోనే వైవా, సెమినార్లు

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో వాయిదాపడిన అండర్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ పరీక్షల నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. జూన్‌ 20 నుంచి చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. బ్యాక్‌లాగ్‌లు కూడా రాసుకోవచ్చు. పరీక్షల వ్యవధిని 3 నుంచి 2 గంటలకు తగ్గించారు. ఆ మేరకు సిలబస్‌ అంతా కవరయ్యేలా, ఎక్కువ ఐచ్ఛికాలు ఉండేలా ప్రశ్నపత్రాలను రూపొందించే బాధ్యత విశ్వశిద్యాలయాలదే. మొదటి సెషన్‌లో బీకాం, రెండో సెషన్‌లో బీఏ, బీఎస్సీ పరీక్షలు జరపాలి. ప్రాక్టికల్స్‌పై కళాశాలలే నిర్ణయం తీసుకోవాలి. వైవా-ఓసీ, సెమినార్లను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి. వీటి వెబ్‌/యాప్‌ లింకులను యూనివర్సిటీల్లోని డిపార్ట్‌మెంటల్‌ రీసెర్చ్‌ కమిటీ(డీఆర్‌సీ) సభ్యులు, ఫ్యాకల్టీ సభ్యులు, రీసెర్చ్‌ స్కాలర్లకు చేరవేయాలి. డిగ్రీ ప్రథమ, ద్వితీయ, పీజీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు కళాశాలలు పునఃప్రారంభమయ్యాక లేదా నవంబరు/డిసెంబరుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. బ్యాక్‌లాగ్‌లున్నా.. తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్‌ చేస్తారు.

Updated Date - 2020-05-30T16:38:48+05:30 IST