తెలుగు వాచకాల్లో ఉత్తరాంధ్ర జానపదం

ABN , First Publish Date - 2020-11-26T14:29:12+05:30 IST

తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఉత్తరాంధ్ర జానపదానికి స్థానం దక్కింది. ప్రముఖ జానపద కళాకారుడు, గిడుగు రామమూర్తి తెలుగుభాష, జానపద కళాపీఠం వ్యవస్థాపకుడు,

తెలుగు వాచకాల్లో ఉత్తరాంధ్ర జానపదం

ఘనత సాధించిన బద్రి కూర్మారావు 

పలాస, నవంబరు 25: తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఉత్తరాంధ్ర జానపదానికి స్థానం దక్కింది. ప్రముఖ జానపద కళాకారుడు, గిడుగు రామమూర్తి తెలుగుభాష, జానపద కళాపీఠం వ్యవస్థాపకుడు, అధ్యాపకుడు బద్రి కూర్మారావు రచించిన కళింగాంధ్ర జానపద గేయాలు, ఉత్తరాంధ్ర జానపద కళలు పుస్తకాల మూలాధారాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. వీటికి ఇటీవల కొత్తగా ప్రచురించిన 5, 7 తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాల్లో 15వ పాఠం జానపద కళలు పేరుతో స్థానం కల్పించింది. ఇందులో తోలుబొమ్మలాటలు, కురవంజి, కోలాటం, చెక్కభజనలు, గిరిజనుల నృత్యం థింసా, బుర్రకథ, హరికథ, వీధిబాగోతం, తప్పెటగుళ్లు వంటి అం శాలు పాఠ్యాంశాలున్నాయి. ఈ సందర్భంగా బద్రి కూర్మారావు ‘ఆంధ్రజ్యోతి’తో మా ట్లాడుతూ తన రచనలు పాఠ్యాంశాలుగా చేర్చడం సంతోషంగా ఉందన్నారు. కూ ర్మారావు శ్రీకాకుళం జిల్లా బీసీ గురుకుల కాలేజీలో అధ్యాపకునిగా పని చేస్తున్నారు.Updated Date - 2020-11-26T14:29:12+05:30 IST