తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-10-12T14:49:19+05:30 IST

ఎంసెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించినట్లు ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. తొలి విడత ప్రక్రియ ఈ నెల 28న ముగుస్తుందన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించినట్లు ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. తొలి విడత ప్రక్రియ ఈ నెల 28న ముగుస్తుందన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు, స్లాంట్‌ బుకింగ్‌ ఈ నెల 19 వరకు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సోమవారం నుంచి ఈ నెల 20వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామని చెప్పారు. వెబ్‌ ఆప్షన్లు 22 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. 22న సాయంత్రం ఆప్షన్లను ఫ్రీజ్‌ చేస్తామని, ఈ నెల 24న సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ఈ నెల 24 నుంచి 28 వరకు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆదివారం నాటికి 35,124 మంది విద్యార్థులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నారని తెలిపారు. 

Updated Date - 2020-10-12T14:49:19+05:30 IST