మాతృభాషలో సాంకేతిక విద్య

ABN , First Publish Date - 2020-11-27T15:58:13+05:30 IST

వచ్చే ఏడాది నుంచి సాంకేతిక విద్యను మాతృభాషలోనూ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యక్రమాలు, పథకాలపై గురువారం

మాతృభాషలో సాంకేతిక విద్య

న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది నుంచి సాంకేతిక విద్యను మాతృభాషలోనూ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యక్రమాలు, పథకాలపై గురువారం కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌  అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి మాతృభాషలోనూ బోధించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అందుకు కొన్ని ఐఐటీలు, నిట్‌ల జాబితాను సిద్ధం చేశామని తెలిపింది. కాగా, స్కాలర్‌షిప్‌, ఫెలోషి్‌పలను సకాలంలో విడుదల చేయాలని యూజీసీకి కేంద్ర మంత్రి సూచించారు. ఆ విషయంలో హెల్ప్‌లైన్‌ సౌకర్యాన్ని కల్పించాలని, విద్యార్థుల సమస్యలు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సరైన దిశలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. పోటీ పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సిలబ్‌సను మదింపు  చేయాలని నిర్ణయించినట్లు విద్యా శాఖ ప్రకటించింది. Read more