ఉపాధ్యాయ బదిలీ నిబంధనల్లో మార్పులు
ABN , First Publish Date - 2020-11-25T15:04:03+05:30 IST
ఉపాధ్యాయ బదిలీ నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీ నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఫ్యాప్టో’తో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ 18న జరిపిన చర్చల సందర్భంగా కుదిరిన అంగీకారం మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధానోపాధ్యాయుల(గ్రేడ్-2) బదిలీకి అర్హమైన గరిష్ఠ సర్వీసును ఐదు విద్యాసంవత్సరాల నుంచి ఐదు పూర్తి సంవత్సరాలకు మార్చారు. స్టేషన్ సర్వీస్ పాయింట్లపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేశారు.