ఆ కాలేజీలపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2020-12-19T15:29:11+05:30 IST

నిర్దేశిత ఫీజు కంటే అదనంగా చెల్లించలేదన్న కారణంగా విద్యార్థులకు టెన్త్‌, ఇంటర్‌ సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వని జూనియర్‌ కాలేజీల మేనేజ్‌మెంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని

ఆ కాలేజీలపై చర్యలు తీసుకోండి

డీజీపీకి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి లేఖ 

అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): నిర్దేశిత ఫీజు కంటే అదనంగా చెల్లించలేదన్న కారణంగా విద్యార్థులకు టెన్త్‌, ఇంటర్‌ సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వని జూనియర్‌ కాలేజీల మేనేజ్‌మెంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ లేఖ రాశారు. ట్యూషన్‌ ఫీజు, ఇతర కారణాలతో జూనియర్‌, సీనియర్‌ ఇంటర్‌ పాసైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలుపుదల చేశారంటూ పలువురు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ఇతర కాలేజీల్లో చేరే పరిస్థితి లేక ఆయా విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని వివరించారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, మేనేజ్‌మెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అందిన ఫిర్యాదులను ఆ లేఖతో జత చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Updated Date - 2020-12-19T15:29:11+05:30 IST