మార్కుల కోసం మనస్పర్థలు
ABN , First Publish Date - 2020-03-13T17:33:40+05:30 IST
సాధించాలంటూ పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడితో పసి హృదయాలు చిన్నప్పటి నుంచే ఒత్తిడికి గురవుతున్నాయి. ఎక్కువ మార్కులు సాధించాలనే తపనలో

పసి హృదయాల్లో పగలు!
నాగర్ కర్నూల్‌లో విద్యార్థి మృతిపై అనుమానాలు
నాగర్‌కర్నూల్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): సాధించాలంటూ పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడితో పసి హృదయాలు చిన్నప్పటి నుంచే ఒత్తిడికి గురవుతున్నాయి. ఎక్కువ మార్కులు సాధించాలనే తపనలో విద్యార్థుల మధ్య పగలు, వైషమ్యాలు తలెత్తుతున్నాయి. తోటి విద్యార్థులపై దాడులకు సైతం పాల్పడుతున్నారు. నాగర్‌కర్నూల్‌లో ఓ విద్యార్థి మృతిపై ఇలాంటి అనుమానాలే తలెత్తాయి. బాధిత తల్లిదండ్రులు చెప్పిన వివరాలు.. తాడూరుకు చెందిన అక్షయ్‌కుమార్ నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదువులో చురుకైన అక్షయ్ తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడని మ రో విద్యార్థి పగ పెంచుకున్నా డు. ఇద్దరూ గత నెల7న ఘర్షణ పడ్డారు. అనంతరం అక్షయ్ మృతి చెందడంతో తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, మరో విద్యార్థి కొట్టడం వల్లే చనిపోయాడని అక్షయ్ స్నేహితులు చెప్పడంతో అతడి తల్లిదండ్రులు నాగర్‌కర్నూల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ ఘట న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మెరిట్ కోసం పసి హృదయాల్లో పగలు పెంచుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ జరిగింది. అయితే, అక్షయ్ మృతిపై మరో వాదన వినిపిస్తోంది. అతడికి చిన్నప్పటి నుంచే గుండెజబ్బు ఉందని, ఆకారణంతోనే చనిపోయాడని చెబుతున్నారు. ఏదేమైనా ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే వాస్తవం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.